
హసన్‌పర్తి, వెలుగు: ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఓ ఏజెంట్‌ను టాస్క్‌ఫోర్స్ ఆఫీసర్లు, కాకతీయ యూనివర్సిటీ పోలీసులు పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్, కేయూ సీఐ సంజీవ్ తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా కమలాపురం మండలం కానిపర్తికి చెందిన జనగాని సురేశ్ గోపాల్‌పూర్‌లోని సరస్వతీ నగర్‌లో ఉంటున్నాడు. ఇతడు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌తో పాటు మట్కా ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, కాకతీయ యూనివర్సిటీ పోలీసులు శనివారం దాడి చేసి సురేశ్‌ను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 10,200, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకొని సురేశ్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ మధుసూదన్, సీఐ సంజీవ్ తెలిపారు.