టీ20 మ్యాచ్ నేపథ్యంలో పోలీసుల అలర్ట్

టీ20 మ్యాచ్ నేపథ్యంలో పోలీసుల అలర్ట్

ఇవాళ టీమిండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ సమయం దగ్గర పడుతుండడంతో భారీ సంఖ్యలో అభిమానులు ఉప్పల్ స్టేడియం వద్దకు చేరుకుంటున్నారు. రెండు జట్ల ఆటగాళ్ళు స్టేడియానికి రానుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్లేయర్స్ లోపలికి వెళ్లనున్న గేట్ నంబర్ 1 వద్ద ప్రత్యేక పోలీస్ అశ్వ దళం సిద్ధంగా ఉంది. ఇదిలా ఉండగా మ్యాచ్ కి ముందు ఇరుజట్ల ప్లేయర్స్ నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు. స్టేడియం లోపల ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

నేడు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న టీ 20 మ్యాచ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉప్పల్ పరిసరాల్లో  అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు . మధ్యాహ్నం మూడు గంటలకు రెండు జట్ల ఆటగాళ్లు స్టేడియంకు చేరుకోనున్నారు. 3 నుంచి 4 గంటల వరకు నెట్ ప్రాక్టీస్ చేయనున్నారు. 4 గంటల తర్వాత ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించనున్నారు. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఉప్పల్ స్టేడియంలోని 12 గేట్లలో 11 ఓపెన్ గా ఉంటాయి. ఒకటో నంబర్ గేట్ నుంచి ఆటగాళ్లు లోపలికి ఎంటర్ కానున్నారు. వెహికిల్ పాస్ ఉన్న వాహనాలకే  స్టేడియం లోపల పార్కింగ్ అవకాశం ఉంటుంది.