సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్

సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్
  • క్రీడాకారులకు ప్రైజులు, స్పోర్ట్స్ మెటీరియల్ అందజేత

ఛత్తీస్గడ్: సుక్మా జిల్లాలోని పొల్లంపల్లి గ్రామంలో  సీఆర్పీఎఫ్ 74వ బెటాలియన్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. 2017 లో నక్సల్స్ దాడిలో మరణించిన కమాండర్ రణభీర్ సింగ్ జ్ఞాపకార్థం ఈ మ్యాచ్ని నిర్వహించినట్లు  సీఆర్పీఎఫ్ కమాండెంట్ డీఎన్ యాదవ్ తెలిపారు. 2017లో నక్సల్స్ జరిపిన దాడిలో 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. అందులో షహీన్ రణభీర్ సింగ్ ఒకరు. ఈ నేపథ్యంలోనే సీఆర్పీఎఫ్ క్రికెట్ మ్యాచ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రోజు రోజుకు పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని, ఇలాంటి మ్యాచ్ల ద్వారా పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయన్నారు. అలాగే గ్రామాల్లోని యువత, బాల బాలికల్లో ఉన్న క్రీడా నైపుణ్యాలను వెలికితీయడానికి ఇలాంటి మ్యాచ్లు దోహదపడుతాయన్నారు. క్రీడలు ఆరోగ్యంతో పాటు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయన్నారు. కాగా విజేతగా నిలిచిన  టీమ్తో పాటు మ్యాచ్లో పాల్గొన్న అన్ని టీమ్ల సభ్యులకు నిర్వాహకలు ప్రైజులు, స్పోర్ట్స్ మెటీరియల్ అందజేశారు. 

For more news..

ఢిల్లీ కోట బద్దలు కొడ్త

స్కూళ్లు మూణ్నెళ్లే ఉన్నా..జాయిన్ చేస్తున్నరు