కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ క్రికెట్ టోర్నీలన్నీ క్రమక్రమంగా ప్రారంభమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. వెస్టిండీస్‌లోని విన్సీ ప్రీమియర్‌లీగ్ టీ10 టోర్నీ ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. ఇదే బాటలో ఆసీస్ క్రికెట్ బోర్డు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్‌లో టీ10, వన్డేలీగ్‌లను ప్రారంభించాలని ఆస్ట్రేలియా క్రికెట్ ఆశిస్తోంది. ప్రభుత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. అయితే ఈ మ్యాచ్‌లను ఖాళీ స్టేడియంలో నిర్వహించనున్నారు. మొదట టీ10 లీగ్ తర్వాత వన్డేలీగ్‌ను ప్రారంభించనున్నారు.
మార్చిలో కరోనా కారణంగా క్రికెట్ కార్యకలాపాలని నిలిచిపోయిన తర్వాత తిరిగి ప్రారంభమవుతున్న రెండో క్రికెట్ లీగ్ ఇదే. మరో వైపు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) కూడా భారత పర్యటనపై చాలా ఆశలు పెట్టుకుంది. సిరీస్ కోసం 50మిలియన్ డాలర్ల అప్పు చేసి ఏర్పాట్లు చేస్తోంది.

