
ముంబై: ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆనందంలో ఇండియాకు తిరిగొచ్చిన ముంబై ఇండియన్స్ ప్లేయర్ క్రునాల్ పాండ్యాకు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో షాక్ తగిలింది. లెక్కచెప్పని గోల్డ్, ఇతర విలువైన వస్తువులు వెంటతెచ్చుకున్న క్రునాల్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు అడ్డుకున్నారు. యూఈఏ నుంచి ఫ్లైట్ వచ్చిన అతను గురువారం సాయంత్రం ఎయిర్‌పోర్టులో దిగాడు. పరిమితికి మించి బంగారం, ఇతర వస్తువులు గుర్తించిన డీఆర్‌ఐ ఆఫీసర్స్ అతడిని అదుపులోకి తీసుకున్నారు. వాటికి ట్యాక్స్ కట్టాలని అడిగారు. గురువారం రాత్రి వరకూ పాండ్యా ఎయిర్‌పోర్టులోనే ఉన్నట్టు సమాచారం.