గొంతెమ్మ గుట్టపై ఆదిమ చిత్రకళ.. డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి టీమ్ గుర్తింపు

గొంతెమ్మ గుట్టపై ఆదిమ చిత్రకళ.. డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి టీమ్ గుర్తింపు

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు: భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ప్రతాపగిరి శివారులోని చిన్నగుట్టపై గొంతెమ్మ గుట్టపై  ఆదిమ  కాలంనాటి చిత్రాన్ని డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి టీమ్ శుక్రవారం గుర్తించింది. చిన్న గుట్ట కుంతి దేవికి అంకితమైనందున గొంతెమ్మ గుట్టగా పిలుస్తారని,  కృష్ణుడు, సుభద్ర, కుంతీదేవి కొన్నాళ్లు ఇక్కడ నివసించారని స్థల పురాణం చెబుతుంది.

పడగరాయి కింద ఆది మానవులు వేసిన  పల్లికాయను పోలిన గంటు చిత్రం( పెట్రోగ్లిప్) ఉంది. ఇది పల్లి చేను పంటను తెలుపుతుంది. మధ్య శిలాయుగానికి చెందిన  సూక్ష్మ రాతి పనిముట్లు కూడా లభించాయి. వాటిని బట్టి 10 వేల నుంచి 5 వేల మధ్య కాలానికి చెందినదై ఉంటాయని రెడ్డి రత్నాకర్ రెడ్డి పేర్కొన్నారు. 

పడగ రాయి కింద ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిన ఆలయం ఉంది. గొంతెమ్మ గుట్టపై గ్రామస్తులు ఏటా లక్ష్మీదేవర కల్యాణం ఘనంగా చేస్తారు. చత్తీస్​ఘడ్ ,తెలంగాణ  నుంచి ఆదివాసులు, స్థానికులు పాల్గొంటారు. పర్యాటక శాఖ గుట్టను వారసత్వ సంపదగా గుర్తించి రక్షణ చర్యలు తీసుకోవాలని డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి టీమ్ కోరింది.