
లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కరోనాతో ఆస్పత్రిలో చేరారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయనే స్వయంగా మార్చి 27న ట్వీట్ చేశారు. వైద్యుల సూచన మేరకు హోంక్వారంటైన్‌లో ఉంటున్నట్లు తెలిపారు. అయితే కరోనా లక్షణాలు ఎక్కువ కావడంతో ఆయన శుక్రవారం ఆస్పత్రిలో చేరినట్లు మరో ట్వీట్ చేశారు.
‘మీ అభినందనలు మరియు ప్రార్థనలకు ధన్యవాదాలు. వైద్యుల సలహా ప్రకారం నేను ఆస్పత్రిలో చేరాను. కొద్ది రోజుల్లో ఇంటికి తిరిగి వస్తానని ఆశిస్తున్నాను. మీరందరూ జాగ్రత్తగా ఉంటూ సురక్షితంగా ఉండండి’ అని ట్వీట్ చేశారు.