
ఖాట్మండు: మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానెకు 8 ఏండ్ల జైలు శిక్ష పడింది. గత డిసెంబర్‌లో అతన్ని దోషిగా తేల్చిన ఖాట్మండు జిల్లా కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. జైలు శిక్షతో పాటు రూ. 3 లక్షల జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ. 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అయితే జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులో అప్పీలు చేస్తామని సందీప్ తరఫు లాయర్ సరోజ్ గిమిరే తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో పోలీసులు సందీప్‌ను అరెస్ట్ చేయడంతో నేపాల్ టీమ్ కెప్టెన్‌గా అతన్ని తొలగించారు. నేపాల్ తరఫున 100 వైట్‌బాల్ మ్యాచ్‌లు ఆడిన స్పిన్నర్ సందీప్ వంద వికెట్లు తీశాడు.