కమల్ హాసన్ పై క్రిమినల్ కంప్లైంట్

కమల్ హాసన్ పై క్రిమినల్ కంప్లైంట్

ఢిల్లీ : మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ చేసిన కామెంట్స్ మరింత కాంట్రవర్సీ అవుతున్నాయి. తమిళనాడులోని అరవకురిచి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల ప్రచారంలో కమల్ హిందూ ఉగ్రవాదులంటూ కొన్ని కామెంట్స్ చేశారు. “స్వతంత్ర భారతదేశంలో తొలి ఉగ్రవాది హిందువే. అతడి పేరు నాథూరాం గాడ్సే. ఇక్కడ ముస్లిం జనాభా ఎక్కువుందని నేను ఈ మాటలు చెప్పడం లేదు. గాంధీ విగ్రహం ముందు నిలబడి ఈ మాట అంటున్నా” అని కమల్ అన్నారు. మే 12న కమల్ హాసన్ ఈ కామెంట్స్ చేశారు.

కమల్ హాసన్ పై ఢిల్లీ పాటియాలా హౌజ్ కోర్ట్ లో క్రిమినల్ కంప్లైంట్ దాఖలైంది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా… హిందుమతానికి టెర్రరిజాన్ని ఆపాదించి మాట్లాడారన్న అభియోగాలపై కమల్ హాసన్ పై ఈ క్రిమినల్ కేసు ఫైల్ అయింది.

ఆదివారం రోజున కమల్ హాసన్ చేసిన కామెంట్స్ పై హిందూత్వ సంఘాలు మండిపడ్డాయి. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఓట్ల కోసం ముస్లిం కమ్యూనిటీ ముందు ఉద్దేశపూర్వకంగా కామెంట్స్ చేశారని ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారని ఫిర్యాదులో తెలిపింది. పీపుల్ యాక్ట్ 1951లోని సెక్షన్ 123(3) ప్రకారం.. ఇది నేరం అని తెలిపింది. మతాలను అడ్డుపెట్టుకుని .. అన్నదమ్ములుగా ఉంటున్న రెండు వర్గాల మధ్య శత్రుత్వం పెంచేందుకు ప్రయత్నించారని ఆరోపించింది. దీంతో… MNM ఫౌండర్ అయిన కమల్ హాసన్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు పోలీసులు.