Cristiano Ronaldo: సౌదీ అరేబియా క్లబ్ తరపున రొనాల్డో తొలి గోల్

Cristiano Ronaldo: సౌదీ అరేబియా క్లబ్ తరపున రొనాల్డో తొలి గోల్

సౌదీ అరేబియా క్లబ్ త‌ర‌ఫున ఆడుతున్న ఫుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో మొదటి గోల్ కొట్టాడు.  సౌదీ ప్రో లీగ్‌లో అల్ ఫ‌తేహ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రొనాల్డోపెనాల్టీని గోల్‌గా మలిచాడు. ఎక్స్ ట్రా టైమ్ లాస్ట్ మినట్ లో రొనాల్డో  గోల్ చేయ‌డంతో ఈ  మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. రొనాల్డో గోల్ చేసిన వీడియో ప్రస్తుతం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో మాంచెస్టర్ యూనైటెడ్ క్లబ్ రొనాల్డోతో  కాంట్రాక్టు ర‌ద్దు చేసుకుంది. ఆ తర్వాత రొనాల్డోతో ఒప్పందం చేసుకునేందుకు ప‌లు ఫుట్ బాల్ క్లబ్ లు పోటీప‌డ్డాయి. అయితే  సౌదీ అరేబియా క్లబ్ అల్ న‌స్రీ రొనాల్డోకు భారీ ధ‌ర ఆఫ‌ర్ చేసింది.  ఏడాదికి 200 మిలియన్ల యూరో కంటే ఎక్కువ మొత్తానికి క్రిస్టియానో రొనాల్డోతో  ఆల్ నస్రీ తో ఒప్పందం కుదుర్చుకుంది. 37 ఏళ్ల రొనాల్డో అల్ నాసర్ క్లబ్ మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. అంటే క్లబ్ తరపున రొనాల్డో  2025 వరకు ఆడతాడు. 

రొనాల్డో జ‌న‌వ‌రి 22న ఆల్ న‌స్రీ త‌ర‌ఫున తొలి మ్యాచ్ ఆడాడు. అయితే  ఆ గేమ్ లో  ఎత్తిఫ‌క్ జ‌ట్టుపై 1-0తో ఆల్ న‌స్రీ గెలుపొందింది. అయితే  రొనాల్డో ఈ మ్యాచ్‌లో ఒక్క గోల్ కూడా చేయలేదు. తాజాగా జరిగిన మ్యాచ్ లో రొనాల్డో గోల్ చేయడంతో..మ్యాచ్ డ్రా అయింది.