స్పీడ్ పెంచిన కరోనా వైరస్.. 21 రోజుల్లో కోటి కేసులు

స్పీడ్ పెంచిన కరోనా వైరస్.. 21 రోజుల్లో కోటి కేసులు

ప్రపంచానికి కరోనా తక్లీఫ్​ ఇంకా పోలేదు. తగ్గినట్టు అనిపించినా.. మళ్లీ కేసులు బాగా​  పెరిగిపోతున్నయి. ఫస్ట్​ టైం కన్నా స్పీడ్​గా నమోదైతున్నయి. జస్ట్​ 21 రోజుల్లోనే కోటి కేసులు వచ్చినయి. మొదట్లో కోటి కేసులు రావడానికి ఆరు నెలలు పడితే.. ఇప్పుడు మూడు వారాల్లోనే నమోదైనయి. మొత్తంగా కరోనా బారిన పడినోళ్ల సంఖ్య ఐదు కోట్లు దాటేసింది. అమెరికా, యూరప్​ల్లో పరిస్థితి మళ్లీ చెయ్యి దాటిపోతోంది. అమెరికాలో రోజూ లక్ష మందికిపైగా వైరస్​ బారిన పడుతున్నారు. ప్రపంచంలో సగానికిపైగా కేసులు యూరప్​లోనే వస్తున్నాయి. డెత్స్​ కూడా రోజూ 9 వేల మార్కును దాటుతున్నాయి. దీంతో చాలా దేశాలు మళ్లీ లాక్​డౌన్​ల వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్​, జర్మనీ, బ్రిటన్​ బంద్ ​పెట్టేశాయి. ఇప్పుడు ఇటలీ కూడా అదే తొవ్వ పట్టింది.

న్యూఢిల్లీ: ప్రపంచంలో రెండు రోజులుగా కరోనా కేసులు 6 లక్షలకు పైగా నమోదవుతున్నాయి. గురువారం 6 లక్షల 17 వేల 383 మంది దాని బారిన పడితే.. శుక్రవారం అంతకుమించి నమోదయ్యాయి. 6 లక్షల 23 వేల 260 మందికి మహమ్మారి సోకింది. ఇప్పటిదాకా ఒక్కరోజు కేసుల్లో ఇదే హయ్యెస్ట్​. ఇటు మరణాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రెండు రోజులుగా 9 వేల మందికిపైగా మహమ్మారికి బలవుతున్నారు. గురువారం 9,059 మంది చనిపోతే.. శుక్రవారం రికార్డ్​స్థాయిలో 9,132 మందిని కరోనా బలి తీసుకుంది. శనివారమూ అదే స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 5 లక్షల 98 వేల 153 మందికి కరోనా సోకింది. 7,445 మంది చనిపోయారు.

ప్రపంచంలో రెండు రోజులుగా కరోనా కేసులు 6 లక్షలకుపైగా నమోదవుతున్నాయి. గురువారం 6 లక్షల 17 వేల 383 మంది దాని బారిన పడితే.. శుక్రవారం అంతకుమించి నమోదయ్యాయి. 6 లక్షల 23 వేల 260 మందికి మహమ్మారి సోకింది. ఇప్పటిదాకా ఒక్కరోజు కేసుల్లో ఇదే హయ్యెస్ట్​. ఇటు మరణాలూ అదే స్థాయిలో పెరుగుతున్నాయి. రెండు రోజులుగా 9 వేల మందికిపైగా మహమ్మారికి బలవుతున్నారు. గురువారం 9,059 మంది చనిపోతే.. శుక్రవారం రికార్డ్​స్థాయిలో 9,132 మందిని కరోనా బలి తీసుకుంది. శనివారమూ అదే స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 5 లక్షల 98 వేల 153 మందికి కరోనా సోకింది. 7,445 మంది చనిపోయారు. శుక్రవారంతో పోలిస్తే కేసులు తక్కువే అయినా.. స్పెయిన్​, స్విట్జర్లాండ్​, స్వీడన్​ వంటి దేశాలు రోజువారీ కేసులను అప్​డేట్​చేయలేదు.  అప్​డేట్​ చేసి ఉంటే కేసులు, మరణాలు రికార్డ్​ను దాటేసేవే.  శనివారం నాటికి 5 కోట్ల 2 లక్షల 47 వేల 449 మంది మహమ్మారి బారిన పడ్డారు. 12 లక్షల 55 వేల 637 మంది చనిపోయారు. 3 కోట్ల 55 లక్షల 41 వేల 269 మంది కోలుకున్నారు.

యూరప్​లో కోటికి పైగానే

యూరప్​లో మొత్తంగా ఇప్పటిదాకా కోటీ 19 లక్షల 28 వేల 309 మందికి కరోనా సోకింది. ప్రపంచమంతా ఒక్కరోజులో 6 లక్షల కేసులొస్తే.. అందులో సగానికిపైగా ఒక్క యూరప్​లోనే వచ్చాయి. శుక్రవారం 3 లక్షల 17 వేల 391 మందికి, శనివారం 3 లక్షల 6 వేల 624 మందికి పాజిటివ్​ వచ్చింది. అయితే, స్పెయిన్​, స్విట్జర్లాండ్​, స్వీడన్​ వంటి దేశాలు కేసులు అప్​డేట్​ చేయకపోవడంతో తగ్గాయి. లేదంటే అంతకుముందు రోజుకన్నా ఎక్కువగానే వచ్చి ఉండేవి. అత్యధికంగా ఫ్రాన్స్​లో ఒక్కరోజులోనే 86,852 కొత్త కేసులొచ్చాయి. మొత్తంగా 17 లక్షల 48 వేల 705 మందికి మహమ్మారి సోకితే.. 40,169 మంది చనిపోయారు. ఆ తర్వాతి ప్లేస్​లో ఉన్నది ఇటలీ. శనివారం అక్కడ 39,811 కొత్త కేసులు నమోదైతే.. 425 మంది మరణించారు. మొత్తంగా అక్కడ 9 లక్షల 2 వేల 490 మంది కరోనా బారిన పడితే.. 41,063 మంది చనిపోయారు. అయితే, మొత్తం కేసుల్లో రష్యా టాప్​ ప్లేస్​లో ఉంది. అక్కడ 17 లక్షల 53 వేల 836 మంది మహమ్మారి బారిన పడ్డారు. అయితే, ఆదివారం నాటికి రష్యాను దాటేసి ఫ్రాన్స్​ ఫస్ట్​ ప్లేస్​లోకి వచ్చే అవకాశం ఉంది. మరణాల్లో బ్రిటన్​ ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. 48,888 మంది కరోనాకు బలయ్యారు. ముందు నుంచీ నిర్లక్ష్యంగానే ఉన్న స్పెయిన్​లోనూ కేసులు బరాబర్​ పెరుగుతున్నాయి. శుక్రవారం 22,516 మంది దాని బారిన పడితే.. 347 మంది చనిపోయారు. దానికి కారణం నైట్​లైఫ్​కు అనుమతివ్వడమే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం కేసులు 13 లక్షల 88 వేల 411 కాగా.. 38,833 మంది చనిపోయారు. ఫస్ట్​వేవ్​లో అసలు సీన్​లోనే లేని పోలండ్​లోనూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 5 లక్షల 21 వేల 640 కేసులతో యూరప్​లో ఏడో స్థానానికి వచ్చింది ఆ దేశం. అయితే, మొత్తం మరణాలు తక్కువగానే ఉన్నా.. రోజువారీ మరణాలు  పెరుగుతున్నాయి. శనివారం 349 మంది చనిపోయారు.

ఇటలీ లాక్​డౌన్​

కేసులు పెరుగుతుండడంతో గురువారం ఇటలీ ప్రభుత్వం లాక్​డౌన్​ ప్రకటించింది. మూడు జోన్లుగా విభజించి ఆంక్షలు పెట్టింది. రెడ్​, ఆరెంజ్​, ఎల్లో జోన్లుగా రీజియన్లకు కేటగిరీలు ఇచ్చింది. ఇటలీకి ఎపిసెంటర్​గా ఉన్న లొంబార్డి, పైడ్మోంట్​, అవోస్తా వ్యాలీ, కెలాబ్రియాలను రెడ్​జోన్​లో పెట్టింది. దేశం మొత్తం రాత్రంతా కర్ఫ్యూ, పొద్దంతా లాక్​డౌన్​లు విధించింది. ఆఫీసులు, అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని ఆదేశాలిచ్చింది. లాక్​డౌన్​ను నిరసిస్తూ స్లొవేనియాలో జనం ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వాటర్​ కెనాన్​లను ఆందోళన కారులపైకి ప్రయోగించారు. ఫ్రాన్స్​లో కేసులు పెరుగుతున్నా స్కూళ్లను ఇంకా ఓపెన్​ చేసి ఉంచడంపై స్టూడెంట్లు ఆందోళనలు చేస్తున్నారు. రోడ్లను బ్లాక్​ చేస్తున్నారు. స్కూల్స్​ ఓపెన్​చేసినా కనీస జాగ్రత్తలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. బుక్​ షాపులను క్లోజ్​ చేయడాన్ని జనం వ్యతిరేకిస్తున్నారు. బుక్​షాపులు తెరవాల్సిందిగా దాదాపు 2 లక్షల మంది దాకా ఫ్రెంచ్​ ప్రెసిడెంట్​కు పిటిషన్​ పంపించారు. జర్మనీలోనూ బుక్​షాపులు తెరవాలంటూ జనం ఆందోళనలు చేస్తున్నారు.

శ్రీలంకలో మూడోవేవ్​!

శ్రీలంకలో థర్డ్​వేవ్​ వచ్చే ముప్పు పొంచి ఉందని ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెబుతూనే.. ఆంక్షలను ఎత్తేస్తోంది. దేశ క్యాపిటల్​ సిటీ అయిన కొలంబోలో లాక్​డౌన్​ను తీసేసింది. రాత్రి కర్ఫ్యూను ఎత్తేసింది. అయితే, వెస్టర్న్​ ప్రావిన్స్​లోని కొన్ని ప్రాంతాలను మాత్రం ఇంకా ఐసోలేషన్​లోనే ఉంచుతున్నట్టు కరోనా నివారణ ఆపరేషన్స్​ సెంటర్​ హెడ్​ అయిన ఆర్మీ కమాండర్​ షవేంద్ర సిల్వా చెప్పారు. దేశంలో లక్షణాల్లేని కేసులు ఎక్కువగా వస్తున్నాయని చీఫ్​ ఎపిడెమియాలజిస్ట్​ డాక్టర్​ సుదాత్​ సమరవీర తెలిపారు.

పొల్యూషన్తో ఢిల్లీలో ..

పండుగలు, కాలుష్యంతో ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్​ జైన్​ అన్నారు. ఫస్ట్​, సెకండ్​వేవ్​ల కన్నా థర్డ్​ వేవ్​లో కరోనా చాలా డేంజర్​గా ఉందన్నారు. మున్ముందు రోజూ 15 వేల కొత్త కేసులు వస్తాయని హెచ్చరించారు. జనాల నిర్లక్ష్యం కూడా కేసులు  పెరగడానికి కారణం అవుతోందన్నారు. కొందరు తమకు ఏమీ కాదులే అన్న ధీమాతో నిర్లక్ష్యంగా ఉంటున్నారని, మాస్కులు కూడా పెట్టుకోవట్లేదని అన్నారు. తొందర్లోనే కేసులు తగ్గుముఖం పడతాయని చెప్పారు.

మన దేశంలోనూ పెరుగుతున్నయ్​

మన దేశంలోనూ కేసులు పెరుగుతున్నాయి. శనివారం 45,674 మందికి వైరస్​ సోకగా.. 559 మంది చనిపోయారు. మొత్తంగా 85 లక్షల 7 వేల 754 మంది దాని బారిన పడగా లక్షా 26 వేల 121 మంది చనిపోయారు.  డెత్​రేట్​ తక్కువగా ఉండడం, రికవరీ రేటు పెరుగుతుండడం  ఊరట కలిగించే విషయం. ఇప్పటిదాకా 78 లక్షల 68 వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేట్​ 92.49 శాతంగా ఉంది. మొన్నటిదాకా ఎపిసెంటర్​గా ఉన్న మహారాష్ట్రలో ప్రస్తుతం కేసులు తగ్గుతున్నాయి. శనివారం 3,959 మందికి కొత్తగా వైరస్​ సోకింది. కేరళ, ఢిల్లీల్లో కరోనా బాధితులు పెరుగుతున్నారు. శనివారం 7,201 కేసులతో కేరళ టాప్​ ప్లేస్​లో ఉంటే.. 6,953 కేసులతో ఢిల్లీ సెకండ్​ స్థానంలో ఉంది. మొత్తం కేసుల్లో 77 శాతం 10 రాష్ట్రాల నుంచే వస్తున్నాయి. ఇప్పటిదాకా మొత్తం 11 కోట్ల 77 లక్షల 36 వేల 791 టెస్టులు చేశారు.