ఫస్ట్ డోస్ వేసుకోనోళ్లు ఇంకా కోట్లలోనే..

ఫస్ట్ డోస్ వేసుకోనోళ్లు ఇంకా కోట్లలోనే..

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ ​విషయంలో మన దేశం 17వ స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్‌ పవార్‌‌ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. అర్హులైన అడల్ట్‌ పాపులేషన్‌లో డిసెంబర్‌‌ 8 వరకు 13.3 కోట్ల మంది ఇంకా ఫస్ట్ డోసు వేసుకోలేదన్నారు. ఇప్పటిదాకా 33.6 కోట్ల మంది ఫస్ట్‌ డోసు వ్యాక్సిన్‌ వేసుకున్నట్లు, ఇందులో 17.2 కోట్ల మంది పురుషులు, 16.4  కోట్ల మంది మహిళలు, 90 వేలమంది ఇతరులు ఉన్నారన్నారు. అయితే వీరు సెకండ్‌ డోసు వేసుకోవాలని తెలిపారు. అవర్​ వరల్డ్​ ఇన్​ డేటా ప్రకారం సౌత్‌ కొరియా, జపాన్‌, ఇటలీ, ఫ్రాన్స్‌, యూకే, జర్మనీ, అమెరికా, టర్కీ, బ్రెజి ల్‌, మెక్సికో దేశాల ప్రజలు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారని మంత్రి చెప్పారు. డిసెంబర్‌‌ 8 వరకు దేశ జనాభాలో అర్హులైన 53% మంది అడల్ట్‌ పాపులేషన్‌ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు చెప్పారు.