క్రాస్ కంట్రీ వన్డే సిరీస్ విన్నర్‌‌‌‌‌‌‌‌ సీఎఫ్‌‌‌‌సీ

క్రాస్ కంట్రీ వన్డే సిరీస్ విన్నర్‌‌‌‌‌‌‌‌ సీఎఫ్‌‌‌‌సీ

హైద‌‌‌‌రాబాద్, వెలుగు :  మెల్‌‌‌‌బోర్న్ క్రికెట్ టీమ్‌‌‌‌తో జరిగిన క్రాస్ కంట్రీ వన్డే సిరీస్ టోర్నమెంట్‌‌‌‌లో  హైద‌‌‌‌రాబాద్​కు చెందిన సీఎఫ్‌‌‌‌సీ ఎక్స్‌‌‌‌లెన్స్ క్రికెట్ అకాడ‌‌‌‌మీ విజేతగా నిలిచింది.  సీఎఫ్‌‌‌‌సీతో 2 వ‌‌‌‌న్డేలు, 3 టీ20లు ఆడేందుకు  మెల్‌‌‌‌బోర్న్ క్రికెట్ టీమ్ హైద‌‌‌‌రాబాద్ టూర్​కు వచ్చింది. ఇందులో భాగంగా జ‌‌‌‌రిగిన వన్డే సిరీస్‌‌‌‌ను సీఎఫ్‌‌‌‌సీ 2–-0తో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో సీఎప్‌‌‌‌సీ 6 రన్స్‌‌‌‌ తేడాతో మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ టీమ్‌‌‌‌పై గెలిచింది.

తొలుత సీఎఫ్‌‌‌‌సీ 49.4 ఓవర్లలో 277కు ఆలౌటైంది. ఆర్యన్‌‌‌‌ (71), షానవాజ్‌‌‌‌ (54)  ఫిఫ్టీలతో రాణించారు. ఛేజింగ్‌‌‌‌లో మెల్‌‌‌‌బోర్న్‌‌‌‌ జట్టు 48.3 ఓవర్లలో 263 రన్స్‌‌‌‌కే ఆలౌటై ఓడింది. సీఎఫ్‌‌‌‌సీ ఫౌండ‌‌‌‌ర్ మెంబర్ భరణి విన్నర్‌‌‌‌‌‌‌‌కు ట్రోఫీ అందించారు. ఈ సంద‌‌‌‌ర్భంగా డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌లో ఇటీవ‌‌‌‌ల నిల‌‌‌‌క‌‌‌‌డ‌‌‌‌గా రాణిస్తున్న హైద‌‌‌‌రాబాద్ యువ క్రికెట‌‌‌‌ర్లు రోహిత్ రాయుడు, కార్తికేయ‌‌‌‌, సిరిచంద‌‌‌‌న, అనురాగ్‌‌‌‌, య‌‌‌‌శ‌‌‌‌స్వి, శ్రున్జిత్ రెడ్డి తదితరులకు హెచ్‌‌‌‌సీఏ ఆఫీస్ బేరర్లతో కలిసి సీఎఫ్‌‌‌‌సీ అకాడ‌‌‌‌మీ హెడ్‌‌‌‌ కోచ్ జ‌‌‌‌గ‌‌‌‌దీశ్ రెడ్డి  రూ.5 ల‌‌‌‌క్షల ప్రోత్సాహాన్ని అందజేశారు.