 
                                    పాపన్నపేట, వెలుగు: శివసత్తుల పూనకాలు, పోతరాజుల ఆటలతో ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలిరావడంతో ఏడుపాయల పరిసర ప్రాంతాలు దుర్గమ్మ నామస్మరణతో మార్మోగాయి. భక్తులు మంజీర పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించి దుర్గమ్మ దర్శనం కోసం మండపంలో బారులు తీరారు.భక్తుల రద్దీ ఎక్కవగా ఉండడంతో దర్శనానికి సమయం పట్టింది.

 
         
                     
                     
                    