మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ టౌన్, వెలుగు: మెదక్​ చర్చికి ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించగా మధ్యాహ్నం చర్చి ప్రెసిబిటరీ ఇన్‌చార్జి  శాంతయ్య​ దైవసందేశాన్ని అందించారు. అనంతరం చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పిల్లలు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి.  చర్చి బాధ్యులు సాంసన్​ సందీప్​, సంపత్​, సువన్​ డగ్లస్​, కమిటీ మెంబర్లు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులు చర్చి పరిసర ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకొని ఆనందంగా గడిపారు.