యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 3గంటలు

యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ.. స్వామివారి దర్శనానికి 3గంటలు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా 150 రూపాయల స్పెషల్ దర్శనానికి 2గంటల సమయం పడుతోంది.  దీంతో ఆలయ పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కల్యాణం, కొండ కింద కల్యాణ కట్ట, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడితో ఆహ్లాద వాతావరణం నెలకొంది.  భక్తులకి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లను చేసినట్లుగా ఆలయ అధికారులు  వెల్లడించారు.  

హుండి ఆదాయం..

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి  శనివారం హుండీ ఆదాయాన్ని  ఆలయ అధికారులు లెక్కించారు.  మొత్తం హుండీ ఆదాయం  10లక్షల 47వేల 537 రూపాయలు.  ప్రధాన బుకింగ్ ద్వారా 96వేల 100 రూపాయలు, బ్రేక్ దర్శనం ద్వారా లక్షా 37వేల 100, వీఐపీ దర్శనం ద్వారా 60వేల రూపాయలు వచ్చాయని ఆలయ అధికారులు వెల్లడించారు.