తిర్యాణి మండలంలోని అందాల మాటున పొంచి ఉన్న ప్రమాదం

తిర్యాణి మండలంలోని అందాల మాటున పొంచి ఉన్న ప్రమాదం

తిర్యాణి మండలంలోని డోర్లి ఓపెన్ కాస్ట్ ప్రాంతంలో బ్లూ వాటర్ ఆకట్టుకుంటోంది. చుట్టూ అటవీ ప్రాంతం, కొండల మధ్య నీలి రంగులో మెరిసే నీటిని చూసేందుకు సందర్శకులు తరలివస్తున్నాయి. అయితే ఈ ప్రాంతం ఎంత ఆకర్షణీయంగా ఉందో అంతే ప్రమాదకరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో బొగ్గు తవ్వకాలు కొనసాగుతున్నాయని, 70 మీటర్ల వరకు లోతు ఉంటుందని పేర్కొంటున్నారు. 

గనుల్లో ఉపయోగించిన రసాయనాలు, చుట్టుపక్కల కొండల మధ్య నీరు నిల్వ ఉండటంతో బ్లూ కలర్‌లో నీరు కనిపిస్తోందని, స్వచ్ఛమైన నీరు కాదని స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించవద్దని, బ్లూ వాటర్ వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు. - తిర్యాణి, వెలుగు: