లైసెన్స్ లేకుండా హోటల్ ఎలా నిర్వహిస్తున్నారు? : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు

లైసెన్స్ లేకుండా హోటల్ ఎలా నిర్వహిస్తున్నారు? : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు

భీమదేవరపల్లి, వెలుగు : ట్రేడ్​ లైసెన్స్​ లేకుండా హోటల్​ ఎలా నిర్వహిస్తారని ఫుడ్​ సేఫ్టీ ఆఫీసర్లు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ లో తనిఖీలు చేసి, ట్రేడ్ లైసెన్స్ లేకుండా హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహించడంపై ఫైర్​ అయ్యారు. 

ఫుడ్ సేఫ్టీ అధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ ఆహార పదార్థాల తయారీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా పరిశుభ్రత పాటించాలని, ఆహార పదార్థాల తయారీలో మోతాదుకు మించి రంగులు వాడకూడదన్నారు. కిరాణా దుకాణాల్లో గడువు ముగిసిన వస్తువులను అమ్మకూడదన్నారు. ఈ సందర్భంగా హోటళ్లలో నుంచి వివిధ రకాల ఆహార పదార్థాల శాంపిల్స్, కిరాణాల దుకాణం నుంచి నూనె, ఇతర వస్తువులు టెస్ట్​ కోసం తీసుకువెళ్తున్నట్లు ఆయన తెలిపారు.