కల్లూరు మండల పరిధిలోని జడ్పీ హైస్కూల్ స్థలానికి హద్దులు ఏర్పాటు

కల్లూరు మండల పరిధిలోని జడ్పీ హైస్కూల్ స్థలానికి హద్దులు ఏర్పాటు
  •     ఆక్రమణదారులకు నోటీసులు జారీ

కల్లూరు, వెలుగు : మండల పరిధిలోని పేరువంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేటాయించిన స్థలం ఆక్రమణకు గురైందన్న ఆరోపణలతో శుక్రవారం తహసీల్దార్ పులి సాంబశివుడు ఆధ్వర్యంలో నక్ష ఆధారంగా హద్దులు ఏర్పాటు చేశారు. ఇటీవల రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి,  సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ పాఠశాలను  ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్​ స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. పాఠశాల స్థలాన్ని పూర్తిస్థాయిలో హద్దులు ఏర్పాటు చేసి ప్రహరీ నిర్మాణానికి అంచనాలు రూపొందించి పంపించాలని చెప్పారు. 

దీంతో మండల స్థాయి అధికారులు శుక్రవారం హద్దులు ఏర్పాటు చేశారు. పాఠశాల స్థలాన్ని కొంతమంది ఆక్రమించినట్లుగా గుర్తించడంతో వారికి నోటీసులు అందిస్తామని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కీసర నిర్మల మోహన్ రెడ్డి  ఎంఈఓ పత్తిపాటి నివేదిత, ఆర్ఐ ఉమామహేశ్వరరావు, సర్వేయర్ బొగ్గుల ప్రసాద్ రెడ్డి, జీపీఓ, సీనియర్ నాయకులు కీసర మోహన్ రెడ్డి, స్కూల్ హెచ్ఎం  మౌలాలి, వార్డ్ మెంబర్ బడుగు వెంకటేశ్వరావు, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది సురేశ్, మురళి, తదితరులు పాల్గొన్నారు.