గుండాల, వెలుగు : రైతులు సాగు చేసిన పంటకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. శుక్రవారం గుండాల మండల కేంద్రంలోని పీఏసీఎస్ లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజన్లో యూరియా సరఫరా చేయడంలో గుండాల పీఏసీఎస్ నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
యాసంగి సీజన్లో భాగంగా అక్టోబర్ లోనే మొక్కజొన్న కోసం ప్రవేట్ డీలర్ల వద్ద10,493 బ్యాగులు, పీఏసీఎస్ లో 1,508 బ్యాగులను అందుబాటులో ఉంచామన్నారు. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారస్తుల వద్ద 890, పీఏసీఎస్‌లో 1,181 యూరియా బ్యాగులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందవద్దన్నారు. ఏవో వెంకటరమణ, ఏఈఓలు పాల్గొన్నారు .
యూరియా కోసం కుస్తీ వద్దు.. కుర్చి ముద్దు..
పెనుబల్లి : రైతులు యూరియా కోసం పొద్దున్నే క్యూ లో నిలబడి ఇబ్బందులు పడుతూ గొడవలు పడొద్దని పెనుబల్లి మండల కేంద్రంలోని జిల్లా సహకార బ్యాంకు వద్ద శుక్రవారం యూరియా సరఫరా చేసే వద్ద కూర్చిలు వేసి కూర్చోబెట్టారు. ఒక్కొక్కరిని లోపలికి పిలిచి ఆన్లైన్ చేసి యూరియా బస్తాలు ఇచ్చి పంపారు. దీవతో రైతులు సంతోషంగా వెళ్లారు.
యూరికోసం ఆందోళన వద్దు..
కల్లూరు : మండలంలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని ఏడీఏ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. కల్లూరు మండల పరిధిలోని పడవర లోకారం, పుల్లయ్య బంజర, వాచ్చ నాయక్ తండా, లింగాల గ్రామాల్లో ఎరువులు షాపులను అగ్రికల్చరల్ ఆఫీసర్ మాదాబత్తుల రూపతో కలిసి ఆయన తనిఖీ చేశారు. యూరియా స్టాక్ ను ఎప్పటికప్పుడు బోర్డు మీద రాయాలని షాప్ యజమనూలను ఆదేశించారు.
కల్లూరు మండలంలో ప్రస్తుతం 250 మెట్రిక్ టన్నులు యూరియా నిల్వ ఉందని తెలిపారు. వ్యవసాయ శాఖ అందించిన కార్డు ద్వారా రైతులు వేసిన పంటను బట్టి మూడు దశలుగా యూరియా పంపిణీ చేస్తారని చెప్పారు.
