ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా సోయా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నారని, వారి వద్ద ఉన్న సోయా పంటను పూర్తిస్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. శుక్రవారం సీఎంను హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు. వానకాలం సీజన్‌లో సుమారు 6,200 మంది రైతుల నుంచి ప్రభుత్వం 1.64 లక్షల క్వింటాళ్ల సోయాబీన్ మాత్రమే కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.
కోత దశలో కురిసిన నిరంతర వర్షాల కారణంగా సోయా పంట రంగు మారిందని, నిబంధనల పేరుతో కొనుగోళ్లను తిరస్కరించడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. మద్దతు ధర కింద రంగు మారిన సోయాబీన్‌ను కొనుగోలు చేయాలని కోరారు.
