యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్టలో భక్తుల సందడి

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. హాలిడే కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకున్నారు.  నారసింహుడికి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన హోమం తదితర నిత్య పూజలు జరిపి మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ కారణంగా ధర్మదర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది.  నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.55,38,896 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు. 

ప్రసాదాల తయారీ పరిశీలన

భక్తులకు విక్రయించే లడ్డూ, పులిహోర తయారీని ఆలయ ఈవో భాస్కర్ రావు ఆదివారం పరిశీలించారు.  ప్రసాదాల తయారీలో నాణ్యత పాటించాలని, భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ, సూపరింటెండెంట్ అశోక్  ఉన్నారు.