
బషీరాబాద్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో ఓ గేదెకు వింతైన బర్రె దూడ పుట్టింది. గ్రామంలోని వీరారెడ్డి అనే రైతు పెంచుతున్న గేదెకు రెండు తలల దూడ జన్మించింది. ఈ దూడను చుట్టుపక్కల వారితోపాటు గ్రామ ప్రజలు వింతగా తిలకిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పశు వైద్యాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. జన్యుపరమైన లోపం వల్లే ఇలాంటివి అరుదుగా జరుగుతుంటాయని అధికారులు తెలిపారు.