భయపడకుండా బాదేవాళ్లే కావాలె

భయపడకుండా బాదేవాళ్లే కావాలె

ఐపీఎల్ పద్నాలుగో సీజన్, రెండో ఫేజ్ ఆసక్తికరంగా సాగుతోంది. ముంబై ఇండియన్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌‌లో కేకేఆర్ విక్టరీ కొట్టింది. ముఖ్యంగా ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ఆడిన తీరుకు ప్రశంసలు దక్కతున్నాయి. 25 బాల్స్‌లోనే హాఫ్ సెంచరీ బాదిన అయ్యర్.. ధనాధన్ బ్యాటింగ్‌తో పవర్‌ఫుల్ బౌలింగ్ అటాక్‌తో ఉన్న ముంబైకి చుక్కలు చూపించాడు. దీంతో అతడిపై పొగడ్తల వర్షం కురుస్తోంది. లెఫ్టాంటెడ్ బ్యాట్స్‌మన్ అయిన వెంకటేశ్ అయ్యర్.. వెటరన్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్‌ను మరిపిస్తున్నాడని సీనియర్ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ అన్నాడు. 

‘ముంబైతో మ్యాచ్‌లో వెంకటేశ్ అయ్యర్ అనుభవం ఉన్న ప్లేయర్‌లా ఆడాడు. పరిణతితోపాటు ధైర్యంగా బ్యాటింగ్ చేయడం ఆకట్టుకుంది. భయపడకుండా హిట్టింగ్ చేశాడు. ఇలాంటి ఆటగాడి కోసమే ఐపీఎల్‌లో వెదుకులాడుతాం. వెంకటేశ్‌లో గొప్ప విశేషం ఏంటంటే.. అతడు ఓపెనింగ్ అనే కాదు బ్యాటింగ్ ఆర్డర్‌లో ఏ పొజిషన్‌లో అయినా సరిపోతాడు. అతడి బ్యాటింగ్‌లో యువరాజ్ సింగ్ స్టయిల్ ఎక్కువగా కనిపించింది. బ్యాటింగ్ చేసిన తీరు అచ్చం యువీలాగే ఉంది’ అని పార్థీవ్ పటేల్ చెప్పాడు. వెంకటేశ్ అయ్యర్ కూల్‌ బ్యాట్స్‌మన్ అని ఇంగ్లండ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అన్నాడు. ‘వెంకీ చాలా కూల్. అతడు పెద్దగా ఎమోషన్స్ చూపడు. బౌల్ట్, మిల్నే లాంటి బౌలర్లు వేసిన తొలి బంతులను వెంకీ సిక్సర్ల స్టాండ్‌లోకి పంపాడు. స్పిన్నర్లు వచ్చినప్పుడు హెల్మెట్ తీసి అటాక్ చేస్తున్నాడు’ అని స్వాన్ పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తల కోసం: 

తప్పు చేస్తే కాళ్లు, చేతులు నరికేస్తాం

అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీవవ!.. అలాంటి లింక్స్ ఓపెన్ చేయొద్దు 

కొవిడ్ సర్టిఫికెట్ ఉంటేనే శ్రీవారి దర్శనం

టిఫిన్ బాక్స్ బాంబులతో అటాక్‌కు ప్లాన్.. ఇంటెలిజెన్స్ అలర్ట్