
సౌదీ అరేబియా చట్టాలు తెలియక తప్పులు చేసి జైళ్లపాలైన ఇండియన్లకు త్వరలో విముక్తి దొరకనుంది. సౌదీ అరేబియా జైళ్లలో మగ్గుతున్న 850 మంది ఇండియన్ ఖైదీలను విడుదల చేసేందుకు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ అంగీకరించారు. ఇండియా పర్యటనలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హజ్ కోటా పెంపు: ఇండియాలో సుమారు100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతానని ప్రకటించిన సౌదీ ప్రభుత్వం, హజ్ యాత్రీకుల కోటాను 2లక్షలకు పెంచింది. 2017లో ఈ సంఖ్య 1.75లక్షలుగా ఉంది.