47 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా.. 1100 మంది క్వారంటైన్​కు

47 మంది సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా.. 1100 మంది క్వారంటైన్​కు

న్యూఢిల్లీ:  సీఆర్పీఎఫ్ బెటాలియన్‌లో 47 మంది జవాన్లకు కరోనా పాజిటివ్ కన్ఫామ్ అయింది. వారితో కాంటాక్ట్ అయిన 1100 మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 257 మంది టెస్ట్ రిజల్ట్స్ రావాల్సి ఉందన్నారు. గడిచిన రెండు రోజుల్లో తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్ సీఆర్పీఎఫ్ 31వ బెటాలియన్ లో వైరస్ సోకిన వారి సంఖ్య భారీగా పెరిగింది. ఏప్రిల్ 24న బెటాలియన్ నుంచి తొమ్మిది మంది సీఆర్పీఎఫ్ సిబ్బందికి పాజిటివ్ కన్ఫామ్ కాగా మరుసటి రోజు మరో 15 మందికి వైరస్ సోకింది. అన్ని కంపెనీలు డ్యూటీ వెహికల్స్ లో తప్పనిసరిగా శానిటైజర్ యంత్రాలను ఉంచేలా చూడాలని సీఆర్పీఎఫ్ అధికారులు ఇప్పటికే ఆదేశాలిచ్చారు. పాజిటివ్ వచ్చిన జవాన్లు మాండావలిలోని ఐసోలేషన్ సెంటర్ లో ట్రీట్​మెంట్ పొందుతున్నారని, మిగతావారందరి నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నట్లు తెలిపారు.

హెడ్ కానిస్టేబుల్ మృతి
అస్సాంలోని బ‌ర్పేట‌కు చెందిన‌ 55 ఏళ్ల జవాన్ సఫ్దర్‌జంగ్ కరోనాతో మంగళవారం చనిపోయారు. దేశంలోని సెంట్రల్ ఫోర్సెస్ లో నమోదైన ఫస్ట్ డెత్ ఇదేనని అధికారులు తెలిపారు. 162వ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఆయనకు డయాబెటిస్, హై బీపీ వంటి సమస్యలుండటంతో వైరస్ ప్రభావం తీవ్రమై చనిపోయినట్లు వెల్లడించారు.