పోలింగ్ లో ఐఈడీ బ్లాస్ట్.. సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు

పోలింగ్ లో ఐఈడీ బ్లాస్ట్.. సీఆర్పీఎఫ్ జవాన్ కు గాయాలు

ఛత్తీస్‌గఢ్ లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు మొదలయ్యాయి. సుక్మా జిల్లాలోని తొండమార్క ప్రాంతంలోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో  ఐఈడీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎలక్షన్ డ్యూటీ చేస్తోన్న సీఆర్పీఎఫ్ కోబ్రా బెటాలియన్ కు చెందిన ఓ జవాన్ గాయపడ్డాడు. ఛత్తీస్‌గఢ్‌లోని ఫేజ్-1లో 20 స్థానాలకు జరుగుతున్న పోలింగ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో.. ఎన్నికల విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్  సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో నక్సలైట్లు ఎక్కువగా ఉన్న బస్తర్ డివిజన్‌లోని స్థానాల్లో గట్టి నిఘా ఉంచిన పోలీసులు, పారామిలటరీ సిబ్బంది గట్టి బందోబస్తులో ఉదయం ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.