మిజోరం, ఛత్తీస్గఢ్లో మొదలైన పోలింగ్

మిజోరం, ఛత్తీస్గఢ్లో మొదలైన పోలింగ్

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా 2023 నవంబర్ 7న మిజోరంలో పోలింగ్​ప్రారంభమైందిఉదయం 7 గంటలకు పోలింగ్​స్టార్ట్  కాగా.. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు.   మిజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు.. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలన్నాయి.. 8.57లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 18 మంది మహిళలు ఉన్నారు. 1,276 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ నిర్వహిస్తున్నారు. 

ఛత్తీస్​గఢ్​లో తొలి దశ పోలింగ్​

ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్​ప్రారంభమైంది.  మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 20 స్థానాలకు తొలి దశ పోలింగ్ జరగనుంది. మొదటి దశలో 5,304 పోలింగ్ స్టేషన్లలో 40 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. . ఈ సీట్లలో 25 మహిళలు సహా మొత్తం 223 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  నక్సల్స్ ప్రభావిత బస్తర్ డివిజన్ ల్లోని 600 పోలింగ్ స్టేషన్లలో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 40 వేల మంది సెంట్రల్ ఆర్మ్​డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఏపీఎఫ్), 20 వేల మంది స్టేట్ పోలీసులను అధికారులు మోహరించారు.