
జైపూర్(భీమారం) : మంచిర్యాల జిల్లాలో గుండెపోటుతో ట్రైనీ జవాన్ చనిపోయాడు. భీమారం మండల కేంద్రంలోని ఓల్డ్ వాటర్ ట్యాంక్ ఏరియాకు చెందిన రామల్ల కళ, -గట్టయ్య దంపతులకు కొడుకు సాగర్(28), కూతురు ఉన్నారు. సాగర్ గతేడాది చివర్లో సీఆర్పీఎఫ్ జవాన్ పరీక్షలో ఎంపికై నాలుగు నెలలుగా ఏపీలోని చిత్తూరు జిల్లా కలికిరిలో ట్రైనింగ్తీసుకుంటున్నాడు. అతడి కుడి కాలుకు దెబ్బ తగలడంతో ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకొని మూడు రోజుల కింద లీవ్ పై ఇంటికి వచ్చాడు.
బుధవారం ఫ్రెండ్ పెండ్లికి వెళ్లొస్తూ సాగర్ మంచిర్యాలలోని ఓ హోటల్ కు వెళ్లాడు. అక్కడ కూర్చొని ఉండగానే ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. చేతికందిన ఒక్కగానొక్క కొడుకు అకాల మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.