కరెంట్ పోల్.. డేంజర్ బెల్​

కరెంట్ పోల్.. డేంజర్ బెల్​

అసలే వానాకాలం.. ఆపై తుప్పు పట్టిన ఇనుప కరెంట్ స్తంభం ప్రమాదకరంగా మారింది. బౌద్ధనగర్​ డివిజన్​ పార్సీగుట్ట అశోక్​ సేవా సంఘ సమీపంలో కరెంట్ స్తంభం అగుడున తుప్పు పట్టి ఉంది. ఏ సమయంలోనైనా కూలిపోయేలా ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వానలు కురుస్తున్న క్రమంలో ప్రమాదం పొంచి ఉందంటున్నారు. గతంలో పలువురికి కరెంట్ పోల్​షాక్​ కొట్టిందని పేర్కొంటున్నారు. 

దీనిపై ఇప్పటికే పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తుప్పుపట్టిన కరెంట్​ పోల్​ ను తొలగించి కొత్తది ఏర్పాటు చేసి, వేలాడే కరెంట్ తీగలను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు. – పద్మారావునగర్, వెలుగు