
లండన్ : అమెరికాకు చెందిన స్పై డ్రోన్‌ను ఇరాన్ కూల్చేయడంతో ఆయిల్ ధరలు భగ్గుమన్నాయి. ఒక్కరోజే ఆరు శాతానికి పైగా ఎగిశాయి. తమ స్పై డ్రోన్‌ను కూల్చేసి ఇరాన్ చాలా పెద్ద తప్పిదమే చేసిందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. యూరప్ బ్రెంట్ క్రూడ్ సుమారు 5 శాతానికి ఎగిసింది. హర్మూజ్‌జలసంధి సమీపంలో ఇరాన్ ఆ డ్రోన్‌ను పేల్చేసింది. ఇది క్రూడాయిల్ రవాణాకు అత్యంత కీలకమైన చెక్ పాయింట్. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచుతూ.. తదుపరి రేట్ల కోత ఉండొచ్చని సిగ్నల్స్ ఇచ్చింది. నో–డీల్ బ్రెగ్జిట్ విషయంలోనూ ప్రమాదకరమైన సంకేతాలను ఇచ్చింది.