ప్రజాస్వామ్య రీతిలో ర్యాలీ చేస్తే అరెస్టులా?

ప్రజాస్వామ్య రీతిలో ర్యాలీ చేస్తే అరెస్టులా?
  • రాహుల్, ప్రియాంక అరెస్టుపై సీఎం రేవంత్ ఫైర్ 

హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో సోమవారం ప్రజాస్వామ్య రీతిలో ర్యాలీ చేపట్టిన కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర కాంగ్రెస్ ఎంపీలతో పాటు ప్రతిపక్ష ఎంపీలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీఎం  రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. 

ఈ అరెస్టులను అమానవీయం, అప్రజాస్వామిక చర్యగా అభివర్ణించారు. ఓట్ల చోరీని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ర్యాలీగా వెళ్తున్న నేతలను అడ్డుకోవడం దుర్మార్గమని సీఎం రేవంత్ మండిపడ్డారు. ఓటర్ లిస్టుల అవకతవకలపై రాహుల్ గాంధీ లేవనెత్తిన వాస్తవాలను బీజేపీ జీర్ణించుకోలేక, అక్రమ అరెస్టులకు పాల్పడిందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్ ఓట్ల చోరీపై స్పందించి, జరిగిన తప్పిదాలను సరిదిద్దాలని కోరారు. రాహుల్, ప్రియాంక, ఖర్గేల అరెస్టును అప్రజాస్వామిక చర్య అని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.