
హైదరాబాద్, వెలుగు: సింగిల్ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్ ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తన ప్రధాన హాస్పిటల్‌ను ప్రారంభించింది. ఇందులో 150 పడకలు, 4 ఆపరేషన్ థియేటర్లు, 34 డయాలసిస్ బెడ్లు, యూరాలజీ, నెఫ్రాలజీ ఆపరేషన్ల కోసం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ ఉన్నాయని ప్రకటించింది. దీంతో దేశంలోనే సింగిల్ స్పెషాలిటీ ఆస్పత్రులలో ఇది అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్అవుతుందని తెలిపింది.
గ్లోబల్‌గా, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో యూరలాజికల్ సమస్యలు పెరుగుతున్నాయి. వాటిలో భారతదేశం ముందుంది. రక్తపోటు, మధుమేహం, ఊబకాయంతోపాటు దీర్ఘకాల కిడ్నీ వ్యాధి (సీకేడీ) ముప్పు భారతీయులకు చాలా ఎక్కువగా ఉంటోంది. మూత్ర కోశ సమస్యలు, కిడ్నీ వ్యాధులు, యూరలాజికల్ క్యాన్సర్ లాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయని ఏఐఎన్‌యూ తెలిపింది.