
స్టాక్ మార్కెట్, మ్యుచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ఒకవైపు మోసాలు జరుగుతుంటే.. ఈ మధ్య లేటెస్టుగా క్రిప్టో పెట్టుబడుల పేరున సామాన్యులను లూటీ చేస్తున్నారు దుండగులు. పెట్టిన పెట్టుబడికి డబులు, త్రిపుల్ ప్రాఫిట్ ఇస్తామని చెప్పి ఇన్వెస్ట్ చేయించి.. తీరా బోర్డు ఎత్తేస్తున్నారు. ఇలాంటి ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. క్రిప్టో మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకులను ఆదివారం (అక్టోబర్ 12) అరెస్టు చేశారు పోలీసులు.
క్రిప్టో కరెన్సీ ఇన్వెస్ట్ మెంట్ పేరున మెటా ఫండ్ ప్రో యాప్ నిర్వాహుకులు మోసం చేశారని పోలీసులను ఆశ్రయించారు బాధితులు. మెటా ఫండ్ ప్రో యాప్ లో రూ.80 లక్షల50 వేలు పెట్టిన ఓ బాధితుడు మోసపోయినట్లు ఫిర్యాదు చేశాడు. పెట్టిన డబ్బు తిరిగి చెల్లించకపోగా చంపేస్తామని బెదిరించినట్టు పేర్కొన్నాడు.
దీంతో యాప్ కీలక నిర్వాహకులు వారాల లోకేష్, కస్తూరి రాకేష్ లపై కేసు నమోదు చేశారు జగిత్యాల పోలీసులు. బిట్ కాయిన్, క్రిప్టో కేసులో ఇప్పటికే కస్తూరి రాకేష్ తో పాటు పలువురి అరెస్ట్ చేశారు.