విధుల్లో ఉన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వండి: సీఎస్ శాంతికుమారి

విధుల్లో ఉన్న రిటైర్డ్ అధికారుల వివరాలు ఇవ్వండి: సీఎస్ శాంతికుమారి

రిటైర్డ్ అయ్యి.. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. రిటైర్డ్ అయిన కొంత మంది అధికారులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చి వివిధ శాఖల్లో నియమించింది. రాష్ట్రంలో కొత్త సర్కార్ ఏర్పడిన తర్వాత  కూడా  ఇప్పటికీ అలాంటి ఆఫీసర్లు విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో విశ్రాంత అధికారులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం పలు శాఖలో విధులు నిర్వహిస్తున్న రిటైర్డ్ ఆఫీసర్లను  గుర్తించి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జనవరి 16వ తేదీన అధికారులను ఆదేశించారు. రేపు సాయంత్రం లోపు వారి వివరాలు అందజేయాలని వివిధ శాఖల హెచ్ఓడీలను సీఎస్ ఆదేశించారు.