రేపటి నుంచే ట్యాంక్ బండ్పై స్టాల్స్

రేపటి నుంచే ట్యాంక్ బండ్పై  స్టాల్స్
  • సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటయ్
  • ఎల్లుండి రాత్రి 11 వరకు సంబురాలు
  • ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్ శాంతి కుమారి 

హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని సీఎస్ శాంతి కుమారి అన్నారు. ఇవాళ సీఎస్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..జూన్ 1వ తేదీ సాయంత్రం నుంచే ట్యాంక్ బండ్ పై స్టాళ్లను ఏర్పాటు చేస్తామని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.

జూన్2న రాత్రి 11 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. 2వ తేదీ సాయంత్రం ఏడు గంటలకు ట్యాంక్ బండ్ పై వెలుగులు విరజిమ్మే క్రాకర్స్, పటాకులు కాల్చుతారని, కార్నివాల్ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు.