హైదరాబాద్, వెలుగు : జీహెచ్ఎంసీ హెడ్డాఫీసుతోపాటు సర్కిల్ ఆఫీసుల్లోని సిటిజన్ సర్వీస్ సెంటర్లు(సీఎస్ సీ) ఆదివారం ఓపెన్ చేసి ఉంటాయని కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ప్రాపర్టీదారులు ఎర్లీ బర్డ్స్కీం కింద 5 శాతం రిబిట్పొందొచ్చని చెప్పారు.
స్కీం ముగిసేందుకు మరో 10 రోజులే ఉండడంతో సిటిజన్సర్వీస్సెంటర్లను సెలవురోజు కూడా ఓపెన్చేస్తున్నామని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు అధికారులు అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.
