పోలీసు శాఖ ఆధ్వర్యంలో కిడ్స్ విత్ ఖాకీ

పోలీసు శాఖ ఆధ్వర్యంలో కిడ్స్ విత్ ఖాకీ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో కిడ్స్​ విత్ ఖాకీ ప్రోగ్రాం నిర్వహించారు.  నిజాంసాగర్​ చౌరస్తాలో  రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులకు అవగాహన  కల్పించారు.  మద్యం సేవించి వెహికల్ నడిపితే కుటుంబం ఏ విధంగా నష్టపోతుందో వివరించారు. సేఫ్ కామారెడ్డి పోస్టర్​ను అవిష్కరించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ రూల్స్ పాటిస్తే  రోడ్డు ప్రమాదాలు ఉండవన్నారు.  ఎస్పీ రాజేశ్​చంద్ర మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా  వారి జీవితంలో గుర్తుండేలా  ఒక మంచి బహుమతి  ఇవ్వాలనే అలోచనతో కిడ్స్ విత్ ఖాకీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఏఎస్సీ చైతన్యారెడ్డి, అడిషనల్ ఎస్పీ నర్సింహరెడ్డి, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.  

తాడ్వాయిలో.. 

తాడ్వాయి :  ఎస్పీ ఆదేశాల మేరకు శుక్రవారం తాడ్వాయి పోలీస్ స్టేషన్ లో చిల్డ్రన్స్ విత్ ఖాకీ  కార్యక్రమాన్ని నిర్వహించారు. 11 మంది కామారెడ్డి ఎస్పీఆర్ స్కూల్ విద్యార్థులు పోలీస్ స్టేషన్​ను సందర్శించగా ఎస్సై నరేశ్ కేసుల దర్యాప్తు, లాండ్ ఆర్డర్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏఎస్సై కొండల్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.