
సీఎస్ఐఆర్ సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR CCMB) ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29.
పోస్టుల సంఖ్య: 09.
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్–II 02, ప్రాజెక్ట్ అసోసియేట్ – I(పీఏటీ–I) 05, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ (సీనియర్ పీఏటీ) 02.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీ.టెక్/ బీఈ, డిప్లొమా, ఎంఎస్సీ, ఎం.టెక్/ ఎంఈ, ఎంవీఎస్ సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 35 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 19.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 29.
సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.ccmb.res.in వెబ్సైట్లో సంప్రదించగలరు.