CSK vs DC: రెండో వికెట్ కోల్పోయిన చెన్నై

CSK vs DC: రెండో వికెట్ కోల్పోయిన చెన్నై

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్  రెండో  వికెట్  కోల్పోయింది.  రుతురాజ్ గైక్వాడ్  24 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. అంతకు ముందు డేవన్ కాన్వే కూడా  10 పరుగులు చేసి అక్షర్ బౌలింగ్ లో  ఔటయ్యాడు.  ప్రస్తుతం అజింక్యా రహానే  13   మొయిన్ అలీ 5 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం చెన్నై 8 ఓవర్లు ముగిసే సరికి 57 పరుగులు చేసింది. 

 ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్ లు ఆడి  6 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది.  ఇక ఢిల్లీ క్యాపిటల్స్  10 మ్యాచుల్లో నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.