CSKvsGT: చెన్నై vs గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఫైనల్ కు వెళ్లేదెవరు?

CSKvsGT:  చెన్నై vs గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఫైనల్ కు వెళ్లేదెవరు?

చెన్నై: ఇన్నాళ్లూ క్రికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఉర్రూతలూగించిన ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–16 ఆఖరి అంకానికి చేరుకుంది. మంగళవారం జరిగే క్వాలిఫయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–1లో డిఫెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో.. చెన్నై సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఇందులో గెలిచిన టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేరే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉండటంతో ఇరుజట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజల్ట్​ను పరిగణనలోకి తీసుకుంటే టైటాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్త మెరుగ్గా ఉన్నా.. లెజెండరీ కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధోనీ స్ట్రాటజీల ముందు నిలుస్తుందా? లేదా? చూడాలి. ఇక లీగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దశలో ఇరుజట్ల మధ్య జరిగిన ఒకే  ఒక్క మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలిచినా నాకౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోరు మరో స్థాయిలో ఉండనుంది. ఇరుజట్లలో టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్లకు కొదవలేకపోవడంతో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అంచనా వేయడం కష్టంగా మారింది.  

‘టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ లేపాలి..

ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం సీఎస్కే మరోసారి సీనియర్లపైనే ఎక్కువగా ఆధారపడే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ఢిల్లీతో ఆడిన ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలెవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకటి, రెండు మార్పులు చేయనుంది. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డేవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాన్వే ఇచ్చే శుభారంభంపై భారీ స్కోరు ఆధారపడి ఉంది. వన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అజింక్యా రహానె ఫైనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షో కోసం ఎదురుచూస్తున్నాడు. మిడిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శివమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూబే, మొయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ, అంబటి రాయుడు మెరుపులు మెరిపిస్తే ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చెన్నై విజయం నల్లేరుమీద నడకే. అయితే అలీ, రాయుడు ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ ఇద్దరిలో ఒకర్ని ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉపయోగించుకోనున్నారు. గాయంతో ధోనీ సరైన స్థాయిలో బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేకపోవడం లోటుగా కనిపిస్తున్నది. ఆల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడేజా మరోసారి కీలకం కానున్నాడు. పేసర్లుగా దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీక్షణ, తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండేను తీసుకోవచ్చు. చెపాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెమ్మదిగా ఉండటంతో స్పిన్నర్లుగా జడేజా, అలీతో పాటు మతీషా పతిరణకు చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దక్కొచ్చు. ఒకవేళ కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బట్టి పతిరణను ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూడా వాడుకోవచ్చు. ఓవరాల్​గా ఈ మ్యాచ్​లో 200లకు పైగా టార్గెట్​ను నిర్దేశిస్తేనే గెలుపుపై ఆశలు ఉంటాయి. 

గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోనే ప్రమాదం..

గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మొత్తం ఒకెత్తు అయితే శుభ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒక్కడు మరో ఎత్తు. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న అతన్ని ఎంత త్వరగా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తారన్న దానిపైనే సీఎస్కే విక్టరీ ఆధారపడి ఉంటుంది. గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇంపాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాడుకునే చాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉంది. ఓపెనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాహాపై ఒత్తిడి నెలకొంది. డాసున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షనక, డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెరుపుల కోసం జీటీ ఆతృతగా ఎదురుచూస్తోంది. గతేడాది దుమ్మురేపిన రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెవాటియా ఈసారి వెనకబడిపోయాడు. ఫినిషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అతను ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అత్యంత కీలకం కానున్నాడు. హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా కూడా అండగా నిలిస్తే జీటీ విజయం మరింత ఈజీ కానుంది. స్పిన్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్​లోనూ రాణిస్తుండటం కలిసొచ్చే అంశం. సహచరుడు నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టర్నింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మ్యాజిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. పేసర్లు మహ్మద్​ షమీ, మోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రభావం చూపిస్తే సీఎస్కేను తక్కువ స్కోరుకు కట్టడి చేయొచ్చు. 

జట్లు (అంచనా)

చెన్నై: ధోనీ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), డేవన్​ కాన్వే, రుతురాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైక్వాడ్​, రహానె, శివమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూబే, మొయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ, అంబటి రాయుడు, జడేజా, దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీక్షణ, తుషార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాండే, మతీషా పతిరణ. 

గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: హార్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), సాహా, గిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డాసున్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షనక, రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెవాటియా, రషీద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, యష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధయాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మహ్మద్​ షమీ, నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ.