డైమండ్స్ ను వెనక్కి ఇచ్చేయాలంటూ పలు దేశాల్లో డిమాండ్లు

డైమండ్స్ ను వెనక్కి ఇచ్చేయాలంటూ పలు దేశాల్లో డిమాండ్లు

క్వీన్ ఎలిజబెత్ మరణం తర్వాత ఆమె కిరీటంలో పొదిగిన వజ్రాలను, రాయల్ ఫ్యామిలీ ఆస్తులుగా ఉన్న డైమండ్స్ ను వెనక్కి ఇచ్చేయాలంటూ పలు దేశాల్లో డిమాండ్లు మొదలయ్యాయి. రాణి కిరీటంలోని వజ్రాలన్నీ వివిధ దేశాల నుంచి దొంగిలించి తెచ్చినవేనని, వాటిని వెనక్కి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతు న్నాయి. తాజాగా సౌత్ ఆఫ్రికాలోనూ ఇలాంటి డిమాండ్ ఒకటి తెరపైకి వచ్చింది. బ్రిటన్ రాజకుటుంబ ఆస్తిగా ఉన్న ‘గ్రేట్ స్టార్ ఆఫ్​ ఆఫ్రికా’ అనే 530.2 క్యారెట్ల వజ్రాన్ని వెనక్కి ఇచ్చేయాలంటూ సౌతాఫ్రికన్లు ఆన్ లైన్ క్యాంపెయిన్​ ప్రారంభించారు. దీనిపై ఇప్పటికే వేలాది మంది సంతకాలు చేశారు. ప్రస్తుతం ఈ డైమండ్​ను లండన్ లోని జ్యువెల్ హౌజ్​లో ప్రదర్శనకు ఉంచారు.