పత్తికి లాగోడి ఎక్కువ.. కష్టమెక్కువ..!

పత్తికి లాగోడి ఎక్కువ.. కష్టమెక్కువ..!

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం చెప్పినట్లుగా వరికి బదులు పత్తి పంట సాగు చేస్తే రైతుపై అదనపు భారం పడుతుందని అగ్రికల్చర్​ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. లాగోడి (పెట్టుబడి ఖర్చు)తోపాటు కష్టం కూడా ఎక్కువ చేయాల్సి ఉంటుందంటున్నారు. నాలుగు నుంచి నాలుగున్నర నెలల్లో వరి పంట చేతికి వస్తుంది. అదే పత్తి పంటైతే 8 నుంచి 9 నెలల టైం పడుతుంది. రేయింబవళ్లు కష్టపడి పత్తి పండిస్తే వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రమే. ఈసారి ఉన్న మద్దతు ధర వచ్చే ఏడాది ఉండకపోవచ్చు. దీంతో రైతులకు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి పక్కగా వస్తుందనే నమ్మకం ఉండదు. ఒక ఎకరా వరి సాగుతో రైతుకు వచ్చే లాభం ఎంతనో దాదాపుగా అంతే మొత్తం పత్తి పంట సాగుతో వస్తుందని అగ్రికల్చర్​ ఎక్స్​పర్ట్స్​ చెబుతున్నారు. కొత్త వ్యవసాయ విధానంలో భాగంగా ఈ సారి ఎక్కువ పత్తిపంట సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత ఏడాది వానాకాలంలో 53 లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేశారు. ఈ సారి వానాకాలంలో అదనంగా  10 లక్షల నుంచి 15  లక్షల ఎకరాల్లో పత్తిపంట సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

పత్తి సాగుతో వడ్డీ వ్యాపారులకు మేలు

పత్తి సాగు చేయాలనే కండిషన్ పరోక్షంగా ఊళ్లలోని వడ్డీ వ్యాపారులకు లాభమని అగ్రిక్చలర్​ ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు. ప్రస్తుతం ఒక ఎకరం భూమిలో వరి సాగు చేసేందుకు రూ. 26 వేల ఖర్చు అవుతోంది. అదే పత్తి సాగు చేస్తే రూ. 36 వేల ఖర్చు వస్తుంది. పత్తి సాగు కోసం రైతులు అదనంగా రూ. 10 వేల పెట్టుబడి పెట్టాలి. మెజార్టీ రైతులు ప్రైవేటు వ్యాపారులు ఇచ్చే అప్పుతోనే సాగు చేస్తుంటారు. ఈ అదనపు రూ. 10 వేల కోసం లోకల్ గా వ్యాపారులను ఆశ్రయించే చాన్స్ ఉంది. రైతులకు బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదని ఓ సీనియర్ ఆఫీసర్​ చెప్పారు. ‘‘లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటి వరకు ఇంకా రైతులకు ఇవ్వలేదు. దీంతో బ్యాంకులు కొత్తగా రుణాలు ఇవ్వడం లేదు. పాత వాటినే రీ షెడ్యూలు చేస్తున్నాయి’’ అని ఆయన వివరించారు.

పెద్దగా ఇంట్రస్ట్​ చూపని రైతులు

వరికి బదులు పత్తి పంట సాగు చేస్తే రైతులు అదనంగా 4 నెలలు కష్టపడాల్సి ఉంటుంది. అంతగా కష్టపడి పనిచేసినా వచ్చే లాభం కూడా తక్కువే అని వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఒక ఎకరం భూమిలో వరి సాగు చేస్తే రైతుకు రూ. 12,535 లాభం వస్తే, అదే ఎకరం భూమిలో పత్తి సాగు చేస్తే వచ్చేది  రూ. 13,000 మాత్రమే. అదనంగా వచ్చే ఆ నాలుగైదు వందల కోసం రైతులు పత్తిని పండించడానికి పెద్దగా ఇంట్రస్ట్ చూపడం లేదు.

ఎకరం భూమిలో వరి సాగుకు ఖర్చు (రూపాయల్లో..)

దున్నడానికి        7,000

ఎరువు                4,000

సీడ్ ఖర్చు              600

నారుమడికి ఎరువు 500

నాటు వేసేందుకు 4,000

కలుపు తీసేందుకు 2,000

గుళికలు                 800

డీఏపీ                  2,800

యూరియా             300

వరికోత                3,000

మార్కెట్ తరలింపు 1,000

మొత్తం ఖర్చు    26,000

ఎకరం భూమిలో పత్తి సాగుకు ఖర్చు (రూపాయల్లో..)

దున్నడానికి             2,700

ఎరువు                     7,800

ఎరువు చల్లడానికి కూలీలకు       600

నాగలితో సాళ్లు దున్నడానికి       700

పత్తి విత్తనాలు          1,500

విత్తనాలు వేసేందుకు    900

గుంటుక కొట్టడానికి   7,000

ఫెర్టిలైజర్స్                1,800

పెస్టిసైడ్స్                  3,000

పెస్టిసైడ్​ కూలీకి         1,000

కలుపు తీయడానికి  1,500

పత్తి ఏరడానికి          7,000

మార్కెట్ తరలింపు    1,000

మొత్తం ఖర్చు   36,500

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పెళ్లి పేరుతో యువ‌కుడికి వ‌ల‌.. రూ.65 ల‌క్ష‌లు నొక్కేసి..

ఇవాళ కొండపోచమ్మ సాగర్‌‌‌‌కు నీళ్లు