గండిపేట్,వెలుగు: రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అంతర కళాశాలల సాంస్కృతిక, సాహిత్య పోటీలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్టు వర్సిటీ డీన్ జెల్లా సత్యనారాయణ, అసోసియేట్ డీన్ సి.నరేంద్రరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో 11 అగ్రి కాలేజీల నుంచి 205 మంది విద్యార్థులు పలు కల్చరల్ యాక్టివిటీస్ లో పాల్గొంటారని తెలిపారు.
