
ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పెరుగు, ఎండు ద్రాక్షను ఆహారంలో చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ రెండింటిని కలిపి తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుందని ఆరోగ్యనిపుణులు సైతం సూచిస్తున్నారు. మనం చెప్పుకున్న వాటిలో పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎండాకాలంలో చాలా మంది ప్రతిరోజు పెరుగుతింటారు. ఎముకలు దృఢంగా ఉండటానికి పెరుగు, ఎండుద్రాక్ష తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం.
వయసు పెరిగే కొద్ది ఎముకల సమస్యలు వస్తాయి. కీళ్ల నొప్పులు సమస్యలు ఉన్నవారు..పుల్లటి పెరుగులో ఎండు ద్రాక్షను కలిపి తీసుకోవడం వలన ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలపర్చడంలో సహాయపడుతుంది.
పోషకాహారం తింటే ఆరోగ్యం.. లేదంటే రోగాల కుప్ప
శరీరానికి కావాల్సిన పోషకాలు అందించినప్పుడే ఆరోగ్యంగా ఉంటాము. లేదంటే రోగాల కుప్పగా మారుతుంది. ముఖ్యంగా శరీరానికి కాల్షియం చాలా ముఖ్యమైంది. కాల్షియం లోపిస్తే ఎన్నో అనారోగ్యాలు పలకరిస్తుంటాయి. శరీరంలో కాల్షియం లోపం ఏర్పడిన వెంటనే, ఎముకల నిర్మాణం బలహీనంగా మారుతుంది. అప్పడు బోలు ఎముకల వ్యాధి వంటి వ్యాధుల బారిన పడవచ్చు. కాబట్టి మీరు కాల్షియం లోపాన్ని తొలగించాలి. ఉదయం అల్పాహారంలో పెరుగు, ఎండుద్రాక్షలను చేర్చుకున్నట్లయితే శరీరానికి కావాల్సినంత కాల్షియం లభిస్తుంది.
కాల్షియం లోపాన్ని తొలగిస్తుంది
పెరుగు, ఎండుద్రాక్ష రెండింటితో, మీరు మీ శరీరంలో కాల్షియం మొత్తాన్ని పెంచుకోవచ్చు. నిజానికి, ఎండుద్రాక్ష,పెరుగు రెండింటిలో కాల్షియం ఉంటుంది, ఇది బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవి ఎముకల సాంద్రతను పెంచి.. వాటికి బలాన్ని చేకూరుస్తాయి.
కీళ్లకు ఎంతో మేలు
ఎండుద్రాక్షలో బోరాన్ కూడా ఉంటుంది. ఈ ఖనిజం ఎముకలు, కీళ్లను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రెండు కీళ్ల మధ్య కదలికలు వంటి అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది.
పెరుగులో ఏముంది..
పెరుగులో భాస్వరం, ప్రోటీన్, లాక్టోస్, కాల్షియం రసాయన పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో శరీరానికి ఇది చాలా అవసరం. వేసవిలో పెరుగు తినడం పురుషులకు మేలు చేస్తుంది..
పురుషులకు ప్రయోజనకరం
ఎండుద్రాక్ష,పెరుగు కలిపిన మిశ్రమాన్ని పురుషులు అధికంగా తీసుకోవడం వల్ల వారిలో వీర్యకణాల నాణ్యత మెరుగుపడటానికి ఈ మిశ్రమం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాకుండా,పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల వ్యాధుల నుంచి మనల్ని రక్షించుకోవచ్చు
పెరుగు,ఎండు ద్రాక్ష ప్రయోజనాలు
పెరుగు, ఎండుద్రాక్షలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ E, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ B 2, విటమిన్ B12 , కెరోటోనాయిడ్స్ వంటివి ఉంటాయి. ఇవన్నీ శరీరాన్ని ఎంతో ఆరోగ్యకరంగా ఉంచుతాయి
బలమైన ఆహారం
పెరుగు ప్రోబయోటిక్, ఎండుద్రాక్ష ఫైబర్ కంటెంట్‌తో మంచి బలమైన ఆహారంగా పనిచేస్తుంది. ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్స్ మిశ్రమం చెడు బ్యాక్టీరియాను తటస్థీకరిస్తుంది. ఇది ప్రేగులలో మంటను తగ్గిస్తుంది, దంతాలు ,చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే ఎముకలు మరియు కీళ్లకు కూడా మంచిది.
ఎలా చేయాలి
ముందుగా ఒక గిన్నెలో చిక్కని పాలను వేడిచేయాలి. గోరువెచ్చగా ఉన్న పాలలో రెండు ద్రాక్షలను వేసి అందులో కొద్దిగా పెరుగును కలపాలి. అలా కలిపి పెట్టిన దానిని ఆరు గంటల పాటు పక్కన పెట్టాలి. ఆరు గంటల తర్వాత ఆ పదార్థం మొత్తం పెరుగుగా మారి గట్టిపడుతుంది. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని తినడం వల్ల వేసవి తాపాన్ని తగ్గించుకోవచ్చు. లేదంటే పెరుగులో ఎండు ద్రాక్షలను కలుపుకని మెత్తగా నానేంత వరకు ఉంచి తినొచ్చు. ఇది శరీరానికి కావాల్సినంత కాల్షియం లభిస్తుంది. ఎర్ర రక్త కణాల సంఖ్యను కూడా పెంచుతుంది. పెరుగు, ఎండు ద్రాక్షలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఈ రెండింటి కలయిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.