లేహ్‌ లో కర్ఫ్యూ కొనసాగింపు

లేహ్‌ లో కర్ఫ్యూ కొనసాగింపు

లేహ్: లడఖ్‌లోని లేహ్‌లో కర్ఫ్యూ కొనసాగుతున్నది. ఘర్షణల తర్వాత బుధవారం కర్ఫ్యూ విధించగా, శనివారం నుంచి ఆంక్షలు సడలించారు. రెండు గంటల పాటు ప్రజలను బయటకు అనుమతిస్తున్నారు. 

‘‘లేహ్‌లో శాంతియుత వాతావరణం నెలకొన్నది. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగలేదు. ఆంక్షలను మరింత సడలించే అవకాశం ఉంది. దీనిపై ఎల్జీ కవీందర్ గుప్తా నిర్ణయం తీసుకుంటారు” అని పోలీసులు ఆదివారం తెలిపారు. 

‘‘ఘర్షణల కేసులో అరెస్టయిన ఇద్దరు కాంగ్రెస్ కౌన్సిలర్లు సహా నలుగురిని కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. మిగతా వాళ్లకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వీరిలో లేహ్ అపెక్స్ బాడీ, లడఖ్ బుద్ధిస్ట్ అసోసియేషన్ నేతలు ఉన్నారు” అని లడఖ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షఫీ తెలిపారు. వాళ్లందరూ నిరపరాధులని, వాళ్ల రిలీజ్ కోసం వాదిస్తామని చెప్పారు.