ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్ హైకి కరెంట్ సప్లయ్‌‌‌‌‌‌‌‌

ఆల్‌‌‌‌‌‌‌‌టైమ్ హైకి కరెంట్ సప్లయ్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: కరెంట్ సప్లయ్‌‌‌‌‌‌‌‌ ఈ నెల 9 న ఆల్‌‌‌‌‌‌‌‌ టైమ్ గరిష్టమైన 223.23 గిగావాట్లను టచ్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో 229 గిగా వాట్లను టచ్ చేస్తుందని పవర్ మినిస్ట్రీ అంచనావేసింది. ఈ ఏడాది మార్చి 16 – జూన్‌‌‌‌‌‌‌‌ 15 మధ్య ఫుల్ కెపాసిటీతో పనిచేయాలని  కోల్ ప్లాంట్లకు  ప్రభుత్వం అప్పుడు గైడెన్స్ ఇచ్చింది. ప్రభుత్వం డేటా ప్రకారం, ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో  కరెంట్ సప్లయ్‌‌‌‌‌‌‌‌ సగటున 215.97 గిగా వాట్లుగా, మే నెలలో 221.34 గిగా వాట్లుగా రికార్డయ్యింది.  

కానీ,  అకాల వర్షాలతో టెంపరేచర్స్ దిగిరావడం వలన కరెంట్ వాడకం  కిందటి నెలలో తగ్గింది. కరెంట్ వాడకం 134.20 బిలియన్‌‌‌‌‌‌‌‌ యూనిట్లకు (బీయూ) తగ్గింది. కిందటేడాది మేలో ఈ నెంబర్ 135.15 బీయూగా ఉంది.  కరెంట్ వాడకం ఈ ఏడాది మార్చిలో 126.82 బీయూగా రికార్డయ్యింది. ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో ఫ్లాట్‌‌‌‌‌‌‌‌గా నమోదయ్యింది.