హోటల్ కెళ్తే మొత్తం డీటైల్స్ ఇయ్యాలి

హోటల్ కెళ్తే మొత్తం డీటైల్స్ ఇయ్యాలి
  • గుళ్లు, హోటళ్లు, మాల్స్‌ ఓపెన్‌పై సర్కార్ గైడ్‌లైన్స్‌
  • గర్భిణులు, వృద్ధులు, పిల్లలను అనుమతించొద్దు
  • డిజిటల్‌ పేమెంట్లు చేయండి.. రెస్టారెంట్లలో సగం సీట్లు ఖాళీ పెట్టాలె

హైదరాబాద్‌‌, వెలుగుహోటళ్లకు వచ్చే కస్టమర్లు తప్పనిసరిగా వారి పూర్తి వివరాలు ఇవ్వాలని.. మాల్స్‌‌, క్లాత్‌‌ స్టోర్స్‌‌లో డ్రెస్సులు కొనే వారు వాటిని ట్రయల్‌‌ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కంటెయిన్ మెంట్‌‌ జోన్‌‌లు మినహా మిగతా ప్రాంతాల్లో సోమవారం నుంచి దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్‌‌ మాల్స్‌‌ ఓపెన్‌‌ చేస్తుండటంతో అక్కడ పాటించాల్సిన నిబంధనలపై ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను తప్పనిసరిగా శానిటేషన్‌‌ చేయాలని.. వృద్ధులు, గర్భిణులను అనుమతించవద్దని, డిజిటల్‌‌ పేమెంట్లు చేయాలని సూచించింది. ఆయా ప్రాంతాల్లో కరోనాపై అవగాహన కల్పించాలని పేర్కొంది. ఏసీల టెంపరేచర్‌‌ 24 సెంటీ గ్రేడ్ల నుంచి 30 సెంటీగ్రేడ్ల మధ్య ఉండాలని తెలిపింది.

  •    దేవాలయాల్లోకి వచ్చే భక్తులు విధిగా సబ్బుతో చేతులు, కాళ్లు కడుక్కోవాలి.
  •    ఆలయాల్లో దేవతామూర్తులు, పవిత్ర గ్రంథాలు, ఇతర వస్తువులను తాకకూడదు.
  •    ప్రసాదం, తీర్థం ఇవ్వకూడదు
  •    అన్నదానం చేసేప్పుడు, వంట చేసేప్పుడు విధిగా సోషల్‌‌ డిస్టెన్స్‌‌ పాటించాలి
  •    ప్రార్థనల కోసం ఎవరి మ్యాట్లు వారే తెచ్చుకోవాలి

 

  •    షాపింగ్ మాల్స్‌‌లోకి పరిమిత సంఖ్యలోనే కస్టమర్లను పంపించాలి.
  •    గర్భిణులు, వృద్ధులు, ఇతర హైరిస్క్‌‌ సమస్యలున్నవారిని అనుమతించొద్దు
  •    వాలెట్‌‌ పార్కింగ్‌‌ స్టాఫ్‌‌ మాస్క్‌‌లు, గ్లౌస్‌‌లు వేసుకోవాలి.
  •    వాహనాల స్టీరింగ్‌‌, డోర్‌‌ హ్యాండిల్స్‌‌, కీస్‌‌ తప్పనిసరిగా క్లీన్‌‌ చేయాలి.
  •    లోపల విధిగా సోషల్‌‌ డిస్టెన్స్‌‌ మెయింటేన్‌‌ చేసేందుకు అవసరమైనంత మంది సిబ్బందిని నియమించాలి.
  •    ఎవరైనా అస్వస్థతకు గురైతే వెంటనే ఐసోలేట్‌‌ చేసి మాస్క్‌‌, ఫేస్‌‌ కవర్‌‌ ఇచ్చి..  హెల్ప్‌‌లైన్‌‌కు సమాచారం ఇవ్వాలి.
  •   ఎవరికైనా కరోనా పాజిటివ్‌‌గా తేలితే అతడు విజిట్ చేసిన, బస చేసిన ప్రాంతాలను శానిటైజ్‌‌ చేయాలి.

 

  •    మాల్స్‌‌, హోటళ్లు, రెస్టారెంట్లలోని చిల్డ్రన్‌‌ ప్లే ఏరియాలను మూసేయాలి.
  •    సోషల్‌‌ డిస్టెన్స్‌‌ పాటించేలా సీటింగ్‌‌ అరెంజ్‌‌మెంట్స్‌‌ చేయాలి.
  •    రెస్టారెంట్ల నుంచి ఫుడ్‌‌ హోం డెలివరీ చేసే సిబ్బందిని విధిగా స్క్రీనింగ్‌‌ చేయాలి.
  •    రెస్టారెంట్లలో 50 శాతం సీటింగ్‌‌ కెపాసిటీకి మించి కస్టమర్లను రానివ్వొద్దు.
  •    క్లాత్‌‌ న్యాప్‌‌కిన్స్‌‌ బదులుగా డిస్పోజబుల్‌‌ పేపర్‌‌ న్యాప్‌‌కిన్లు ఉపయోగించాలి.
  •    బఫే సర్వీస్‌‌ చేసేప్పుడు విధిగా సోషల్‌‌ డిస్టెన్సింగ్‌‌ పాటించాలి.
  •    నగదు పేమెంట్లకు బదులుగా డిజిటల్‌‌ పేమెంట్లు చేయాలి.
  •    వెయిటర్లు, హోటళ్లు, రెస్టారెంట్ల సిబ్బంది విధిగా గ్లౌస్‌‌లు, మాస్క్‌‌లు ధరించాలి.
  •    రెస్టారెంట్లు, హోటళ్లలో చైర్లలోంచి కస్టమర్లు మారిన ప్రతిసారి విధిగా శానిటైజ్‌‌ చేయాలి.
  •    హోటళ్లలో బస చేసే వారు విధిగా రిసెప్షన్‌‌లోనే తమ ట్రావెల్‌‌ హిస్టరీ, హెల్త్‌‌ కండీషన్‌‌, ఐడీ ప్రూఫ్‌‌, సెల్ఫ్‌‌ డిక్లరేషన్‌‌ ఇవ్వాలి.
  •    చెక్‌‌ ఇన్‌‌, చెక్‌‌ ఔట్‌‌ అప్లికేషన్లు ఆన్‌‌లైన్‌‌ విధానంలోనే చేయాలి.
  •    రూమ్‌‌కు గెస్ట్‌‌ లగేజీని పంపడానికి ముందే డిస్‌‌ఇన్‌‌ఫెక్టెంట్లతో క్లీన్‌‌ చేయాలి.
  •    వృద్ధులు, గర్భిణులు హోటళ్లలో బస చేస్తే వారి పట్ల ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి.
  •    రూమ్‌‌ ఖాళీ చేయగానే శానిటైజ్‌‌ చేయాలి.

కరోనా ట్రీట్ మెంట్ ఇక జిల్లాలోనూ