
సేఫ్ గా ఇంటికి చేర్చమని వేడుకోలు
పాలన్ పూర్: లాక్ డౌన్ తో విసుగు చెందిన ఓ కార్మికుడు తనను సేఫ్ గా ఇంటికి చేర్చాలని అమ్మవారిని వేడుకొని మొక్కుగా నాలుకను కోసుకున్నాడు. ఈ ఘటన గుజరాత్ లోని బనాస్కంత జిల్లాలో జరిగింది. నాదేశ్వరీ మాతాజీ ఆలయంలో వివేక్ ఆపస్మారక స్థితిలో ఉండగా పోలీసులు గుర్తించారు. వెంటనే అతడ్ని సూయీ గామ్ ఆస్పత్రికి తరలించారు. వృత్తి రీత్యా శిల్పి అయిన వివేక్ శర్మ సొంతూరు మధ్యప్రదేశ్ లోని మోరెనా. లాక్ డౌన్ కారణంగా నిరాశ్రయుడైన అయిన అతడు ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడు. నాలుకను మొక్కుగా చెల్లించడం ద్వారా తాను ఇంటికి సురక్షితంగా వెళ్తానని వివేక్ భావించి ఉండొచ్చని కొందరు చెప్తున్నారు. పోలీసులు మాత్రం ఇంకా ఏదీ నిర్ధారించలేదు.