డిజిటల్, యూట్యూబ్ ఛానల్స్కు సీవీ ఆనంద్ వార్నింగ్

డిజిటల్, యూట్యూబ్ ఛానల్స్కు సీవీ ఆనంద్ వార్నింగ్

హైదరాబాద్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ చెప్పారు. శుక్రవారం అవాంఛనీయ ఘటనలు జరుగుతాయని అందరూ భావించినా అలాంటివేం జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. అలజడి సృష్టించేందుుక ప్రయత్నించిన వాళ్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నట్లు సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. నాలుగైదు రోజులుగా పోలీసులు రాత్రిపగలన్న తేడా లేకుండా కష్టపడి పరిస్థితిని అదుపు ఉంచారని అన్నారు. 

సోషల్ మీడియాతో పాటు కొన్ని డిజిటల్, యూట్యూబ్ ఛానల్స్ కొన్ని వీడియోలతో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని సీవీ ఆనంద్ అన్నారు. ఆ ఛానల్స్ ఐడెంటిఫై చేసి నోటీసులు ఇచ్చినట్లు చెప్పారు. సోషల్ మీడియా మీద నిఘా పెట్టామన్న సీవీ ఆనంద్.. అలాంటి చర్యలకు పాల్పడితే ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు.రాత్రి 7గంటలకు కర్ఫ్యూ సడలించనున్నట్లు చెప్పిన ఆయన.. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే మళ్లీ యాక్షన్ తీసుకుంటామని చెప్పారు.